డొక్కు కారులో రూ.6.40 కోట్లు

  • In Crime
  • January 24, 2019
  • 746 Views
డొక్కు కారులో రూ.6.40 కోట్లు

బాగా దుమ్ము పట్టిన కారు..చూస్తే ఎక్కడో రిపేర్ కో, వాషింగ్ కో తీసుకెళ్తున్నారు అనుకుంటాం. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇలాంటి కారు ఓ హైవే మీద దూసుకుపోతుంటే కచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. దుమ్ముపట్టిన కారు ఎందుకు ఇంత వేగంగా దూసుకుపోతుందా అని మనకి వచ్చే సందేహమే పోలీసులకి వచ్చింది. కారును ఆపారు. తీరా కారులో డబ్బుల కట్టలు చూసి నివ్వెరపోయారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ  ఘటన రాష్ట్రవ్యప్తంగా కలకలం రేపింది.పోలీసుల కధనం ప్రకారం…పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు చెన్నైకి వెళ్తున్నారు. అదే సమయంలో ఎస్‌ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తుండగా చేనిగుంట జాతీయ రహదారి వద్ద ఓ కారు వేగంగా వెళ్తున్నట్లు గమనించారు. అందులో ప్రయాణిస్తున్న వారి ముఖంలో ఆందోళన కనిపించడంతో అనుమానం వచ్చిన ఎస్‌ఐ.. ఆ కారును ఆపారు. కారులో నగదు, బంగారం కనిపించడంతో ఎవరివని ప్రశ్నించగా సరైన సమాధానం లేకపోవటంతో వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వాటిని లెక్కించి 6,33,69,500 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. వీటితోపాటు రూ.19,11,216 విలువైన విదేశీ కరెన్సీ, ఓ కవరులో 55 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన నగదు నరసాపురానికి చెందిన ఓ నగల వ్యాపారిదిగా గుర్తించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos