జనవరి 15.. కోహ్లీకి కలిసొచ్చిందా?

  • In Sports
  • January 16, 2019
  • 766 Views
జనవరి 15.. కోహ్లీకి కలిసొచ్చిందా?

వన్డే, టెస్టు‌, టీ20.. ఫార్మాట్‌ ఏదైనా టీమిండియా సారధి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ దూకుడు మాత్రం ఒక్కటే. అది అతడి రికార్డులే చెబుతాయి. అడిలైడ్‌ వేదికగా మంగళవారం(జనవరి 15) జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ కోహ్లీ అద్భుత శతకంతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త సంవత్సరంలో అతడికి ఇది తొలి సెంచరీ. అయితే కోహ్లీ కెరీర్‌లో ఈ ‘జనవరి 15’ తేదీ ప్రత్యేకంగా నిలుస్తూ వస్తోంది. ఎందుకంటే.. గత రెండు సంవత్సరాల్లోనూ కోహ్లీ ఆ ఏడాదిలో తన తొలి సెంచరీని జనవరి 15నే నమోదు చేయడం విశేషం. 2017 జనవరి 15న భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య పుణె వేదికగా వన్డే మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 27వ శతకాన్ని నమోదుచేశాడు. అంతేగాక, ఆ ఏడాది కోహ్లీకి అదే తొలి సెంచరీ. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2018 జనవరి 13-17 తేదీల్లో సెంచూరియన్‌ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌ జరిగింది. రెండో టెస్టు మూడో రోజైన జనవరి 15న కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 153 పరుగులు చేశాడు. 2018లో కోహ్లీ తొలి శతకం ఇదే. అయితే ఈ శతకం వృథా అయ్యింది. ఆ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. తాజాగా 2019 జనవరి 15న(మంగళవారం) అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 104 పరుగులు చేశాడు. ఇలా గత మూడేళ్లుగా కోహ్లీ ఏడాదిలో తన తొలి శతకాన్ని జనవరి 15నే సాధించడంతో ఈ రోజు ప్రత్యేకంగా నిలుస్తోంది. అటు అభిమానులు కూడా సోషల్‌మీడియా వేదిక

తాజా సమాచారం

Latest Posts

Featured Videos