జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే

జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే

అమరావతి : ‘జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే .వైకాపా పేదల పార్టీ కాదు. ప్యాలెస్‌ల పార్టీ ’అని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తెదేపా ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.‘ లోటస్ పాండ్‌లో ఓ ప్యాలెస్, బెంగళూరులో మరో ప్యాలెస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్, తాడేపల్లిలో ఇప్పుడు ఇంకో ప్యాలెస్ . తాడేపల్లి ప్యాలెస్ పూర్తయ్యే వరకు జగన్ హైదరాబాద్ వీడి రాలేదు.ప్యాలెస్‌లో తప్పా ఎక్కడా నివసించలేరని’ దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా రాజ ప్రాసాదాల్లోనే జగన్ బస చేస్తారని విమర్శించారు. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్‌, పులివెందుల ప్యాలెస్‌లకు తోడు ఇప్పుడు అమరావతిలో ఇంకో ప్యాలెస్‌ ఏర్పడిందని ఎద్దేవా చేసారు. జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే తప్పా ప్రజాసేవ పట్ల లేదని విమర్శించారు. రాజధాని విషయంలో వైకాపా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిపై ప్రజల్లో అపోహలు పెంచుతారాని ప్రశ్నించారు. వైకాపా తన ఎన్నికల ప్రణాళికలో రాజధాని ఎక్కడ అనే అంశాన్ని ప్రస్తావించి తన దుర్బుద్ధిని బయటపెట్టిందని అన్నారు.   మార్చి 1న విశాఖ మోది సభకు వైకాపా జనాన్ని తరలిస్తోందని, గుంటూరు సభకు కూడా జనాన్ని తరలించిందని ఆరోపించారు. మోదీ విశాఖ రాకను నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి, ఐకాస చేపట్టిన ఆందోళనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos