చిత్తూరు మెట్టప్రాంతాలకు నీటి సరఫరా ఒక చరిత్ర: చంద్రబాబు

చిత్తూరు మెట్టప్రాంతాలకు నీటి సరఫరా ఒక చరిత్ర: చంద్రబాబు

రాయలసీమ సస్యశ్యామలం చేస్తున్నామని, మన ప్రయత్నాలు ఫలించాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీరు-ప్రగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు మెట్టప్రాంతాలకు నీటి సరఫరా ఒక చరిత్రని అన్నారు. పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లి, మదనపల్లికి నీరు చేరితే కరవు అదృశ్యమవుతుందన్నారు. సెరికల్చర్‌ను ప్రోత్సహించాలని, చిత్తూరు టమాట హబ్‌గా రూపొందాలన్నారు. అన్నిప్రాంతాలకు నీరిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో ప్రగతి సాధిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మన నీరు-ప్రగతి సత్ఫలితాలను ఇచ్చిందని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన మైక్రో ఇరిగేషన్ సత్ఫలితాలను ఇస్తోందని చంద్రబాబు అన్నారు. వినూత్న ఆలోచనలు, నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమయిందన్నారు. నీళ్లు బంగారంతో సమానమని, భూగర్భ జలాలు మన వారసత్వ సంపదని, ప్రతి నీటి చుక్క సంపద సృష్టికి దోహద పడాలని చంద్రబాబు అన్నారు.

తాజా సమాచారం