చరిత్ర సృష్టించిన బాహుబలి, కేజీఎఫ్..

  • In Film
  • January 23, 2019
  • 132 Views
చరిత్ర సృష్టించిన బాహుబలి, కేజీఎఫ్..

బాహుబలి చిత్రం రిలీజై రెండేళ్లు కావోస్తున్నా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. దిమ్మతిరిగే వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం దేశంలోనే అద్భుతమైన చిత్రంగా కీర్తించబడుతున్నది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఓర్మాక్స్ మీడియా రూపొందించిన జాబితాలో బాహుబలి1, బాహుబలి2 చిత్రాలకు అగ్రస్థానం లభించింది. వివరాల్లోకి వెళితే..
పదేళ్ల సినిమా చరిత్రలో..
బాహుబలి 2009 నుంచి 2018 వరకు దేశంలోని అత్యుత్తమ చిత్రాల జాబితాను ఓర్మాక్స్ మీడియా రూపొందించింది. థియేటర్ల వద్ద ప్రేక్షకుల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు. ప్రతీ ఏటా విడుదలయ్యే హిందీ చిత్రాలు, ప్రజాదారణ పొందిన చిత్రాల జాబితాను కూడా రూపొందిస్తుంది.
రెండు, మూడు స్థానాల్లో బాహుబలి..
ఒర్మాక్స్ మీడియా రూపొందించిన జాబితాలో 90 పాయింట్లతో 3 ఇడియెట్స్ చిత్రం టాప్ పొజిషన్‌లో నిలిచింది. రెండోస్థానంలో బాహుబలి2 (85 పాయింట్లతో), మూడో స్థానంలో బాహుబలి1 (83 పాయింట్లతో) టాప్‌‌గా నిలువడం విశేషం.
టాప్ టెన్ జాబితాలో..
ఇక టాప్‌టెన్ జాబితాలో దంగల్ చిత్రం (82 పాయింట్లతో), భాగ్ మిల్కా భాగ్ (82 పాయింట్లతో), సంజూ 80 పాయింట్లతో, కేజీఎఫ్ 79 పాయింట్లతో, క్వీన్ 78 పాయింట్లతో, భజరంగీ భాయ్‌జాన్ 77 పాయింట్లతో, బర్ఫీ 77 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో నిలిచాయి.
బాహుబలి యూనిట్ ట్వీట్..
తొలి మూడు స్థానాల్లో బాహుబలి సినిమాకు స్థానం లభించడంపై బాహుబలి యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. బాహుబలికి ఇంత ఆదరణ దక్కడం ప్రేక్షకుల ప్రేమ వల్లే సాధ్యమైంది అని బాహుబలి ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
నిర్మాత శోభు యార్లగడ్డ సంతోషం దేశవ్యాప్తంగా బాహుబలి సినిమాకు అద్భుతమైన గుర్తింపు లభించడంపై నిర్మాత శోభు యార్లగడ్డ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఓర్మాక్స్ మీడియా రూపొందించిన జాబితాలో బాహబలికి చోటు దక్కడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా రూపొందించిన జాబితాలో దక్షిణాదికి మూడు స్థానాలు దక్కడం ఆనందంగా ఉంది అని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos