క్లాస్ పీకిన రష్మి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

  • In Film
  • January 21, 2019
  • 761 Views
క్లాస్ పీకిన రష్మి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

యాంకర్ రష్మి ఓ నెటిజన్‌కి క్లాస్ పీకింది. అసలు విషయం ఏంటంటే.. రష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా ట్విటర్‌లో.. భోగి మంటలకు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసి.. ‘మకర సంక్రాంతి’ అని ట్వీట్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ‘మకర సంక్రాంతి కాదు మేడం.. అది భోగి. తెలుగు నేర్చుకోండి ప్లీజ్’ అంటూ సలహా ఇచ్చాడు. దీనికి రష్మి నెటిజన్‌కి క్లాస్ పీకింది. ‘‘మా కుటుంబంలో మేము మకర సంక్రాంతి మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటామండి. కాబట్టి నేను విష్ చేశాను. నేను మీ సంప్రదాయాన్ని గౌరవిస్తాను. మీరు కారణం లేకుండా బాధపెట్టే స్టేట్‌మెంట్స్ ఇచ్చేదానికంటే నన్ను కూడా గౌరవించండి’’ అని కామెంట్ పెట్టింది. దీనిని చూసిన నెటిజన్లు కొందరు రష్మిని సమర్థిస్తుంటే.. మరికొందరు ‘వైజాగ్‌లో పుట్టి తెలుగు తెలియదు.. అలాగే తెలుగు సంప్రదాయాలూ తెలియదు. తెలియని విషయాలు చెబితే నేర్చుకోవాలి గానీ ఇలా మాట్లాడటమేంటి? అందులో బాధపెట్టే విషయం ఏముంది?’ అంటూ ఫైర్ అవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos