కోట్ల దారెటు?

కోట్ల దారెటు?

క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పార్టీని వీడుతున్నారా. ఆయ‌న పార్టీ నిర్ణ‌యాల ప‌ట్ట ఆసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశంలో కోట్ల పార్టీ నిర్ణ‌యాల పై ఫైర్ అయ్యారు. తెలంగాణ లో ఒక ర‌కంగా..ఏపిలో ఒక ర‌కంగా పొత్తుల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తే పార్టీ మునిగిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఇక‌, పార్టీని వీడే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఆయ‌న‌తో టిడిపి – వైసిపి నేత‌లు ట‌చ్‌లో ఉన్నారు. మ‌రి..కోట్ల ఏ పార్టీ లో చేరుతున్నారు..క‌ర్నూలు లో ఎటువంటి ప్ర‌భావం చూపించ‌గ‌లుగుతారు…

కాంగ్రెస్ పై కోట్ల అసంతృప్తి..పార్టీని వీడుతారా..!
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ స‌మక్షంలోనే ఆయ‌న పార్టీ నిర్ణ‌యాల‌ను త‌ప్పు బ‌ట్టిన‌ట్లు స‌మాచారం. రాహుల్ హామీతో పార్టీ తిరిగి పుంజుక కుంటున్న స‌మ‌యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల ద్వారా పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. పార్టీ బలపడుతున్న తరుణంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడ ఘోరంగా దెబ్బతిన్నాం. మేమే మైనా పొత్తు పెట్టుకోవాలనిన చెప్పామా.. మీరే పొత్తు అన్నారు. ఇప్పుడు మీరే ఒంటరిగా పోటీ చేయాలంటున్నారు. ఇ లాంటి నిర్ణయాల వల్ల పార్టీ మునిగిపోయే ప్రమాదం ఉందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దీంతో..ఆయ‌న పార్టీ మారు తార‌నే ప్ర‌చారం మొద‌లైంది.
కోట్ల‌తో ట‌చ్ లో వైసిపి ..టిడిపి నేత‌లు..
క‌ర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కోట్ల విజ‌య భాస్క‌ర‌రెడ్డి ఏపి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసా రు. ఆయ‌న క‌ర్నూలు లోక్‌స‌భ నుండి ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయ‌న త‌న‌యడు కోట్లు సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి మూడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్ర మంత్రిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూ లు నుండే కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీ చేసి 116603 ఓట్లు సాధించారు. ఇక‌, కొంత కాలంగా ఆయ‌న పార్టీ మారుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న కొద్ది కాలం క్రితం టిడిపి అధినేత తోనూ స‌మావేశ‌మ‌య్యారు. అయితే, కోట్ల కాంగ్రెస్ ను వీడుతార‌నే స‌మాచారం తో కొంత కాలంగా ఇటు టిడిపి నేత‌లు..వైసిపి ముఖ్య నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్ లో ఉన్నారు. వారికి కోట్ల మాత్రం ఎటువంటి హామీ ఇవ్వ‌లేదు. కోట్ల ను చేర్చుకోవ‌టం ద్వారా పార్టీకి క‌లిసి వ‌స్తుంద‌నే లెక్క‌ల‌తో త‌మ వైపు తిప్పుకొనేందుకు రెండు పార్టీల నేత‌లు ప్ర‌యత్నాలు చేస్తున్నారు. టిడిపి నేత‌లు కోట్ల త‌మ పార్టీలో చేరుతున్నా ర‌ని ప్ర‌చారం చేస్తున్నారు.
జ‌గ‌న్ తో కోట్ల సోద‌రుడి భేటీ..!
కాంగ్రెస్ కోర్ క‌మిటీ నుండి కోట్ల ఆర్దాంత‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. ఇదే స‌మ‌యంలో కోట్ల సోద‌రుడైన కోట్ల హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి వైసిపి అధినేత జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోడుమూరు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు . ఫిబ్ర‌వ‌రి 6న వైసిపి లో చేరుతున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు కోడుమూరు తో చెబుతున్నారు. అయితే, కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డికి టిడిపి లోకి వ‌స్తే క‌ర్నూలు ఎంపిగా అవ‌కాశం ఇస్తామ‌ని పార్టీ హామీ ఇచ్చిన‌ట్లు గా చెబుతున్నారు. వైసిపి లో మాత్రం క‌ర్నూలు, నంద్యాల లోక్‌స‌భ స్థానాల్లో ఒక‌టి బిసి వ‌ర్గాల‌కు కేటాయిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. దీంతో.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కోసం పోటీ ఎక్కువ‌గా ఉంది. దీంతో..కోట్ల టిడిపి లో చేరుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఒక‌టి రెండు రోజుల్లోనే కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి పార్టీ త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos