కరెంట్ తో ఇంటర్నెట్…వైఫైతో చార్జింగ్

కరెంట్ తో ఇంటర్నెట్…వైఫైతో చార్జింగ్

టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్న అనేక ఫలితాల్లో ఇదొకటి. ప్రస్తుతం జన జీవితం ఉదయం లేచింది మొదలు వాట్సప్ మెసేజ్ లు – చాటింగ్ లతో మొదలవుతోంది. అంతగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు మొబైల్స్ ను తమ పక్కనే పెట్టుకుని పడుకుంటే కానీ నిద్రపట్టని వాళ్లు కూడా ఉన్నారు. అంతగా వాటికి ఎడిక్టిట్ అవుతున్నారు. ఎక్కువగా స్మార్ట్ యూజ్ చేస్తున్న వారికి బ్యాటరీ చార్జింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. దీనికి సొల్యూషన్ కనిపెట్టారు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ(MIT) సైంటిస్టులు. ఈ శుభవార్తకు తోడుగా మరో శుభవార్తను కేంద్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇంటికి కరెంటు సరఫరా చేసే వైర్లే… ఇకపై ఇంటర్నెట్ ను అందించనున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మొదటి అంశం వివరాల్లోకి … స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్లు వైఫై ఎక్కువ చేస్తుంటారు. గంటల తరబడి వైఫై వాడుతుండటంతో బ్యాటరీ డౌన్ అవుతుంది. అయితే దీనికి రివర్స్ గా బ్యాటరీ చార్జింగ్ అయితే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనతోనే MIT సైంటిస్టులు వైఫై ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలను – కరెంటుగా మార్చే‘‘రెక్టెన్నా’’ అనే వస్తువును కనుగొన్నారు. భవిష్యత్ లో ఇది అసలు బ్యాటరీ లేని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఉపయోగపడొచ్చని చెబుతున్నారు. రెక్టెన్నా వైఫై  ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలతో పాటు రేడియో తరంగాలను కూడా తీసుకుంటుంది. దీనికి కనెక్టయిన సెమీకండక్టర్ AC  తరంగాలను DC కరెంటుగా మారుస్తుంది. దీని ద్వారా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను – బ్యాటరీలను చార్జ్ చేసుకోవచ్చు.పూర్తిస్థాయిలో రెక్టెన్నాను సిద్ధం చేస్తే రోజువారీ ఎలక్ట్రానికి గ్యాడ్జెట్లకు – మెడికల్ డివైజ్ లకు – సెన్సార్లకు వాడొచ్చని సైంటిస్టులు తెలిపారు.ఇక కరెంట్ తీగల ద్వారా విద్యుత్ వివరాల్లోకి వస్తే…ఇంటికి కరెంటు సరఫరా చేసే వైర్ల ద్వారా ఇకపై ఇంటర్నెట్ సరఫరా చేయనున్నట్లు ఎర్నెట్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీనా పహుజా తెలిపారు.బ్రాడ్ బాండ్ – మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు ఈ ఐడియా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించలేకపోయినా – మినిమం స్పీడ్ తో నెట్ యూజ్ చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో డేటా నెట్ వర్క్ విస్తరించడానికి కావాల్సినంత మార్కెట్ ఉందని ట్రాయ్ చైర్మన్ RS శర్మ అన్నారు. ప్రజల్ని చేరడానికి మార్గాలను తెలుసుకోవడమే మిగిలి ఉందని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ అనేది డేటా ట్రాన్స్ ఫర్ కు అందుబాటులో ఉన్న ఒక పద్ధతి మాత్రమేనని – అమలుకు నోచుకుని అలాంటి టెక్నిక్స్  మార్కెట్లో చాలా ఉన్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ ను చేరవేసేందుకు కేబుల్ నెట్ వర్క్ ను వాడుకోవచ్చని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos