ఓట్లు వేయలేదని ఇళ్లపై రాళ్ల వర్షం

ఓట్లు వేయలేదని ఇళ్లపై రాళ్ల వర్షం

ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సర్పంచ్ ఎన్నికలు చిచ్చు పెడుతున్నాయి. తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదన్న కారణంగా.. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. మొదటి విడత పంచాయతి ఎన్నికల్లో ఓడిన అబ్యర్థులు తమ బాధను, కోపాన్ని సామాన్య జనాలపై చూపిస్తున్నారు. దేవరకొండ డివిజన్ పరిధిలో బాంబులు, కత్తుల సంస్కృతి కి కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న చందంపేట ఏరియాలో.. ఈసారి ఒడిన అభ్యర్ధులు, వారి అనుచరులు దాడులకు తెగపడుతున్నారు.చందంపేట మండలం, దేవరచర్ల గ్రామానికి చెందిన పలువురు అదే గ్రామ సమీపంలోని చాపలతండాపై దాడి చేసి.. ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో.. నిన్న సాయంత్రం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. భయం గుప్పెట్లో బతుకుతున్నారు.దేవరకొండ మండలం, తాటికోల్ గ్రామంలో.. 14 ఓట్ల తేడాతో జూలూరు ఉత్తరమ్మ ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి పాలవ్వడానికి కారణం మీరేనని ఆరోపిస్తూ.. సహచర పార్టీ కార్యకర్త కనకాచారి ఇంటిపై దాదాపు 70 మందితో వచ్చి దాడి చేసారు. భయంతో గేటు వేసుకున్నప్పటికి.. చంపుతానని వచ్చి ఇంటిపై రాళ్ళతో దాడి చేశారు. ఇక్కడ కుల వివాదం కూడా తెరపైకి రావడంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos