ఐసిస్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన పాకిస్తాన్ మిలిటరీ

ఐసిస్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన పాకిస్తాన్ మిలిటరీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ఆర్మీ సీనియర్ అధికారి యూసఫ్ రజా గిలానీ కుమారుడిన ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ మిలిటరీ మట్టుబెట్టింది. మిలిటరీ చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు క్రితం ఇంటలీజెన్స్ విభాగానికి చెందిన ఓ సినియర్ అధికారి హత్య కేసులో నిందితులు. పంజాబ్ పోలీసుకు చెందిన కౌంటర్ టెర్రరిసమ్ డిపార్ట్‌మెంట్ (సీటీడీ) ఈ విషయాన్ని వెల్లడించింది. టెర్రరిస్టుల గురించి తాము సమాచారం అందుకున్నామని వెంటనే ఆపరేషన్‌లోకి దిగి ఐసిస్ కుట్రను భగ్నం చేశామని సీటీడీ పేర్కొంది.‘‘లహోర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో ఓ అద్దె ఇంటిలోకి ఐసిస్ ఉగ్రవాదులు దిగారని సోమవారం సీటీడీకి సమాచారం అందింది. పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తి వారి కదలికలను పసిగట్టి పోలీసులకు సమాచారం అందించాడు’’ అని సీటీడీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ‘‘మేం టెర్రరిస్టులను హెచ్చరించాం. అంతలో వాళ్లు మా సిబ్బందిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. తర్వాత మేం కాల్పులు ప్రారంభించారు. కొంత సేపటికి టెర్రరిస్టులున్న గదిలో నుంచి కాల్పులు ఆగిపోవడంతో మేమూ ముగించాం. ఆ గదిలోకి వెళ్లి చూస్తే ఇద్దరు చనిపోయి ఉన్నారు. వారిని అదీల్ హఫీజ్, ఉస్మాన్ హరూన్ అని గుర్తించాం. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందినవారని తెలిసింది’’ అని సీటీడీ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos