ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలన్నదే ఆయన కోరిక

ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలన్నదే ఆయన కోరిక

ఎలక్షన్ మిషన్ 2019 పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తామన్నా ఆయన… రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీలుంటాయన్నారు. సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, యునైటెడ్ ఇండియా పేరుతో…. అన్ని పార్టీలని ఒకే వేదికపైకి తీసుకొచ్చామని… కర్ణాటక, కోల్ కత్తాలో సక్సెస్‌ చేశామన్నారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ తో పొత్తు లేదని…… అయినా కాంగ్రెస్ నేతలు కోల్ కత్తా ర్యాలీకి వచ్చారని వివరించారు. నిరంకుశ పాలన అంతమే కామన్ మినిమం ప్రోగ్రామన్నారు చంద్రాబాబు. .

దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడమే తమ ఉమ్మడి అజెండా అన్న చంద్రబాబు… రాజ్యాంగాన్ని రక్షించడమే బిజేపియేతర 23 పార్టీల అజెండా అన్నారు. ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీల భద్రతే ఉమ్మడి అజెండారాష్ట్ర హితం కోరే ప్రతిఒక్కరూ టిడిపితోనే ఉన్నారన్నారు. వైసీపీ, బీజేపీలు స్వార్ధం కోసం పనిచేస్తే……. ఒక్క టీడీపీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తోదన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడమే బీజేపీ, వైసీపీల పని అన్నారాయన.అటు ఈ టెలికాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రాబాబు. ఏపిలో చేతకాని వాడు అధికారంలో ఉండాలనేదన్నదే కేసిఆర్ కోరికన్నారు. తన చేతకానితనం తెలంగాణలో ఎక్కడ బైటపతుందోని కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. త్వరలో జరిగే జగన్ గృహ ప్రవేశానికి కేసిఆర్ అతిథిగా వస్తాడట అంటూ విమర్శలు చంద్రబాబు గుప్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos