ఎన్.టి.ఆర్ బయోపిక్ లో అవాస్తవాలు

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో అవాస్తవాలు

విజయవాడ:ఎన్టీఆర్ బయోపిక్‌లో వాస్తవాల్నిచూపించనందునే ఆ
సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారని  భాజపా
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.శుక్రవారం ఇక్కడ ఆయన మాధ్యమ
ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు సినీ ఫక్కీలో రాజకీయాలు చేస్తున్నారని
ధ్వజమెత్తారు. కేంద్ర  ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని తమవిగా తప్పుడు
ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. రైతులను కూడా పార్టీల ఆధారంగా చీల్చి తమ
పార్టీకి చెందిన రైతులకు మాత్రమే లబ్ది చేకూరుస్తున్నారని ఆరోపించారు. పోలవరానికి
 కేంద్రంరూ.6,700 కోట్లు విడుదల చేయగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేద నడం
దారుణమన్నారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో  చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చోవడం
ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల
ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిసి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ అనే
స్టిక్కర్‌ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవసాయ
ఉత్పత్తుల కొనుగోలుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు
ఏమయ్యాయో లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను అన్ని
చేశానంటూ గొప్పులు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రాజమండ్రిలో అమిత్‌
షా చెప్పిన వాస్తవాలు తెదేపా నాయకులకు మింగుడుపటడం లేదని వ్యాఖ్యానించారు.  అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు
నిర్మిస్తున్నారని ఆరోపించారు.. కుమార్తెను చూసేందుకు జగన్‌ లండన్‌ వెళితే ఎన్నికల
డబ్బు సమీకరణకు  విదేశాలకు పోయినట్లు ఆరోపించడం
హస్యాస్పదమన్నారు. ఆ పార్టీ నాయకులు విదేశీ పర్యటనలు చేసేది డబ్బు ఏర్పాటు
చేసుకునేందుకేనాని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకే ఆ పార్టీ ఎంపీలు,
ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos