ఇంట్లో పని మనిషిని, దేశ సేవకుడిని తెలివిగా నిర్ణయించాలి : మోదీ

ఇంట్లో పని మనిషిని, దేశ సేవకుడిని తెలివిగా నిర్ణయించాలి : మోదీ

న్యూఢిల్లీ : నిజాయితీగా సేవలందించేవారిని ఎంపిక చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇంట్లో సహాయక సిబ్బందిని ఏ విధంగా నిర్ణయించుకుంటారో, అదే విధంగా జాతీయ సేవకుడు ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకోవాలని తెలిపారు. తమకు ఎవరు సేవ చేస్తారో గుర్తించి నాయకుడిగా ఎన్నుకోవాలని చెప్పారు.

‘‘మీ సొమ్ము దోచుకునే పని మనిషిని ఇష్టపడతారా? ఇష్టపడకపోతే, మీ దేశ సేవకుడు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి’’ అని మోదీ చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతి ఊబిలో చిక్కుకున్నారని మోదీ గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య కుటుంబానికి చాలా సమన్లు పంపించినప్పటికీ వారు వాటికి అనుగుణంగా ప్రవర్తించడం లేదని తెలిపారు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ నియంత్రణలోని ప్రతి వ్యవస్థ ద్వారా తనను అష్టకష్టాలు పెట్టారని మోదీ తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను జైలులో పెట్టారన్నారు. తమకు కూడా అధికారం ఉందని, కానీ తనకు చట్టం గురించి తెలుసునని చెప్పారు. తాము కూడా అలాగే (కాంగ్రెస్ చేసినట్లుగానే) చేయగలిగి ఉండేవారమని, అయితే తాము చట్టంపై నమ్మకం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌వారికి న్యాయ వ్యవస్థ, సీబీఐ పట్ల నమ్మకం లేదన్నారు. అలాంటివారిని దేశాన్ని పరిపాలించనిద్దామా? అని ప్రశ్నించారు. రాచరికం పట్ల నమ్మకంగలవారికి , ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారికి మధ్య జరుగుతున్న పోరు ఇది అని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos