ఆ పరిస్థితుల్లో భార్య హంతకి కాదు..సుప్రీం సంచలన తీర్పు

ఆ పరిస్థితుల్లో భార్య హంతకి కాదు..సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ, జనవరి 28: తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ మహిళ తన పొరుగింటాయనతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సహించ లేక భార్యను భర్త నిలదీశాడు. మాటా మాటా పెరిగింది. భర్త ఆమెను, తన కూతుర్ని కూడా ‘వేశ్యలు’ అని అర్థం వచ్చేలా తిట్టాడు. ఆమె ఆగ్రహం చెంది భర్తను కొట్టింది. అతని మెడకు ఓ తాడుతో నులిమేసి చంపేసింది. పక్కనే ఉన్న ప్రియుడు కూడా ఆమెకు సహకరించాడు. శవాన్ని దహనం చేశారు. ఈ ఘట న 40 రోజుల తరువాత బయటపడింది. స్థానిక కోర్టు, మద్రాస్‌ హైకోర్టు కూడా ఆ భార్య, ప్రియుడూ హత్యకు పాల్పడ్డట్లు తేల్చి జైలుశిక్ష విధించాయి. తమను హంతకులనడాన్ని ఆ మహిళ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆమెపై హత్య కేసు పెట్టడం తప్పు అని సుప్రీం తీర్పునిచ్చింది. ‘‘భారతీయ సమాజంలో ఏ మహిళా తనను వేశ్య అనీ, కూతుర్ని వేశ్య అనీ తిట్టడాన్ని సహించదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఆగ్రహంతో దాడిచేసింది. పథకం ప్రకారం చేసిన హత్య కాదు. దీన్ని మర్డర్‌ అనరాదు, కల్పబుల్‌ హోమిసైడ్‌ (ఉద్దేశపూర్వకం కాని, దండనీయ హత్య)గా పరిగణించాలి’’ అని జస్టిస్‌ ఎం శంతన్‌గౌడార్‌, జస్టిస్‌ దినేశ్‌ మాహేశ్వరిల బెంచ్‌ తీర్పిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos