ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..!

ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..!

యువ దంపతుల మధ్య కలహాలు రావడం, విడాకుల కోసం కోర్టులకెళ్లడం సహజంగా చూస్తుంటాం. కానీ 70ఏళ్ల వయస్సులో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. భర్తను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఈ క్రమంలో వారి ముదిమి వయస్సు కాపురాన్ని న్యాయసేవా సంస్థ చక్కదిద్దింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచకు చెందిన పరిటాల నర్సింహాచారి, తన ఆస్తినంతా భార్య పేరిట పెట్టానని, తన వద్ద అప్పులు తీసుకున్న వారు తనకు రాసిచ్చిన హామీపత్రాలను కూడా ఆమె వద్దే ఉంచుకుందని, అయినా తనను సరిగ్గాచూసుకోవడం లేదని, సదరు పత్రాలతో పాటు ఆస్తిలో వాటాను ఇప్పించాల్సిందిగా గతేడాది నవంబరులో కేసు దాఖలు చేశాడు.ఇందుకు స్పందించిన న్యాయమూర్తి ప్రతివాదికి నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో వారిద్దరికి పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించి వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, ఆస్తుల కోసం తగాదా వద్దని సూచించారు. అయితే తన భర్త మద్యం తాగకూడదని, కుటుంబసభ్యులను దుర్భాషలాడొద్దని, భార్యనైన తన పట్ల విసుక్కోకుండా ఉండాలని భార్య షరతులు పెట్టింది. ఈ క్రమంలో వారిద్దరికి కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. కలిసి ఉండేందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ ఇద్దరికి కలిపి లోక్‌ అదాలత్‌ అవార్డు అంద‌జేశారు. కేసును పరిష్కరించడంతో న్యాయమూర్తిచారి తన్నీరు పాపయ్య సహకరించినందుకు ప‌లువురు అభినందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos