అలా చేస్తే భారతీయులకే ఎక్కువ గ్రీన్‌కార్డులు

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వారిలో భారతీయలే ఎక్కువ మంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే కోటాల వల్ల వీటి కోసం భారతీయులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అందుకే ఈ కోటాను ఎత్తివేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే దేశాల కోటా నిబంధనను తొలగించడం వల్ల భారత్‌, చైనా దేశాల వారికే ఎక్కువ గ్రీన్‌కార్డులు వస్తాయని, అంతేగాక.. అమెరికా పౌరసత్వం పొందేవారిలోనూ ఈ దేశాలకు ఆధిపత్యం ఉంటుందని తాజా నివేదిక వెల్లడించింది.

జనవరి 3 నుంచి అమెరికా కాంగ్రెస్‌ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో గ్రీన్‌కార్డుల జారీల్లో దేశాల కోటాను ఎత్తివేసేలా చట్టాన్ని తీసుకురావాలని చాలా మంది ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రేషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) ఇటీవల దేశాల కోటా, శాశ్వత ఉపాధి తదితర అంశాలపై నివేదిక తయారుచేసింది. ఈ కోటాను ఎత్తివేయడం వల్ల అమెరికా మార్కెట్లో ప్రస్తుతం దేశాల మధ్య ఉన్న వివక్ష తొలగిపోతుందని, అయితే దీని వల్ల భారత్‌, చైనా లాంటి దేశాలకు ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుందని సీఆర్‌ఎస్‌ తన నివేదికలో పేర్కొంది.

అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ(యుస్‌సీఐఎస్‌) తాజా గణాంకాల ప్రకారం.. 2018 ఏప్రిల్‌ నాటికి 3,95,025 మంది విదేశీయులు ఒక విభాగంలో గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 3,06,601 మంది భారతీయులే. భారత్‌ తర్వాత 67,031 మందితో చైనా రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుతం దేశాల కోటా వల్ల చాలా మంది భారతీయులు గ్రీన్‌కార్డులు పొందాలంటే దాదాపు తొమ్మిదిన్నర ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. కోటాను ఎత్తివేస్తే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూసే భారతీయుల సంఖ్య భారీగా తగ్గుతుందని సీఆర్‌ఎస్‌ తెలిపింది. దీని వల్ల పెండింగ్‌ దరఖాస్తులు కూడా తగ్గుతాయని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos