అదో ‘అరాచక’ కూటమి: యోగి

అదో ‘అరాచక’ కూటమి: యోగి

లక్నో: దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిశిత విమర్శలు చేశారు. ‘కూటమి కావచ్చు, మహాకూటమి కావచ్చు. 2014 ఎన్నికల్లో కంటే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి తీరుతుంది’ అని ఆయన లక్నోలో మాట్లాడుతూ అన్నారు.ఎస్పీ, బీఎస్‌పీ కూటమితో గురుశిష్యులైన ప్రధాని మోదీ, అమిత్‌షాలకు నిద్రలేని రాత్రులు తప్పవంటూ మాయవతి, అఖిలేష్ ప్రకటించడంపై యోగి స్పందిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి విపక్ష కూటమి వచ్చినా అరాచకత్వం, అవినీతి, రాజకీయ అస్థిరత్వం తప్పవనన్నారు. ఒకరితో ఒకరు ఎప్పుడూ మాట్లాడుకోని వాళ్లు మహాకూటమిగా ఏర్పడితే ఆరాచకత్వమే రాజ్యమేలుతుందని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయి రాజకీయ అనిశ్చితి తలెత్తుతుందని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos