అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త.. ఉద్యోగులకు..

అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త.. ఉద్యోగులకు..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న లక్షా 26వేల పేదల ఇళ్లకు 756 కోట్లు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 1996 -2004 మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు రూ.10వేలు ఇచ్చేందుకు సమ్మతించింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపును మంత్రివర్గం ఆమోదించింది. ఐటీ పాలసీ కింద ఇచ్చే రాయితీల ప్రోత్సాహకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చేనేతకార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం అంశంపై కేబినెట్‌లో చర్చించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos