అక్బర్ పరువునష్టం .. ప్రియా రమణికి నోటీసులు

అక్బర్ పరువునష్టం .. ప్రియా రమణికి నోటీసులు

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో సీినియర్ పాత్రికేయురాలు ప్రియా రమణికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొన్న ఢిల్లీ కోర్టు వచ్చేనెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ప్రియ చేసిన వ్యాఖ్యలపై ఎంజే అక్బర్ పరువునష్టం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి చేసిన ఆరోపణల కారణంగా ఫేస్బుక్ సహా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ‘మీటూ’ ఉద్యమం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 17న కేంద్రమంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయాల్సివచ్చింది. 20 ఏళ్ల క్రితం అక్బర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రియా ఆరోపించారు. అయితే వీటిని ఖండించిన అక్బర్… తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆమెపై కేసు పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos