కులోన్మాద దాడి

కులోన్మాద దాడి

లఖ్నవూ : భారత దేశంలో కులం ప్రాధాన్యత, కులం పేరుతో జరిగిన జరుగుతున్న వివక్ష, దారుణాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. లఖ్నవూలో జొమాటో ఫుడ్ డెలివరీ వ్యక్తిపై జరిగిన దాడి మన మూలాల్లో కులోన్మాదం ఎంత బలంగా వేళ్లూనుకుని ఉందో స్పష్టం చేస్తుంది. నాలుగేళ్లుగా జొమాటో డెలివరీ మ్యాన్గా పని చేస్తున్న వినీత్ కుమార్ అనే వ్యక్తి తనకు ఎదురైనా ఈ దారుణ ఘటనపై ఆక్రోశించాడు. ‘‘శనివారం సాయంత్రం లఖ్నవూలోని ఓ ప్రాంతంలో ఆహారన్ని అందించేందుకు వెళ్లాను. ఆర్డర్ చేసిన వ్యక్తులు నా పేరు, కులం అడిగారు. నా పేరు, కులం చెప్పాను. అంతే అంటరాని వ్యక్తి తెచ్చిన తిండి తీసుకోమని పడేసి, నన్ను కులం పేరుతో తిట్టడం ప్రారం భిం చారు. అవసరం లేకుండా ఆర్టర్ క్యాన్సిల్ చేయమని వారిని కోరాను. కానీ వాళ్లు వినకుండా నా ముఖంపై ఉమ్మారు. మరికొంత మందిని పిలిచి భౌతిక దాడికి దిగారు. వాళ్లు నా బండి లాక్కున్నారు. నేను పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేశాను. పోలీసులు ఘటనా ప్రదేశంలోకి వచ్చి నా బండి ఇప్పించారు’’ అని తెలిపాడు. ఈస్ట్ జోన్లో ఎఫ్ఐ ఆర్ నమోదు చేశామని అడిషనల్ కమిషనర్ ఆప్ పోలీస్ ఖాసిం అబిది తెలిపారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos