నేను హిందువునే

నేను హిందువునే

అమరావతి: ‘నేను నూటికి నూరు శాతం హిందువును. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవమ’ని లోక్సభ మాజీ సభ్యుడు , తితిదే పాలకమండలి అధ్యక్షులుగా నియమితులు కానున్న వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టీకరించారు. తితితే అధ్యక్షుడుగా నియమించాలని ముఖ్యమంత్రి తన పేరు పరిశీలించటమే తరువాయి గిట్టనివారు తాను క్రైస్తవుడినని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్ర చారాన్నిప్రారంభించినట్లు విమర్శించారు. హిందు మత సంస్థ పదవికి క్రైస్తవుణ్ని ఎలా నియమిస్తారనీ ప్రశ్నిస్తున్నారని ఆక్రోశించారు. ‘నేను హిందు వును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. తితిదే ఛేర్మన్గా జగన్ మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే దైవ సేవతో పదవిని సద్వి నియో గం చేసుకుంటా నన్నారు. తితిదేయే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేప ట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్ కచ్చితంగా తీరు స్తారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos