ష ర్మిల పార్టీ పేరు వైఎస్ఆర్టిపి

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తండ్రిపేరు మీదనే కలిసొచ్చేలాగా తెలంగాణాలో రాజకీయ పక్షం- వైఎస్ఆర్టిపి ఆరంభించనున్నారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అన్న జగన్కూ.. నాకు ఎటువంటి పోటీ ఉండదు. ఎవరి పార్టీ కోసం వారు కట్టుబడి ఉంటారు. అన్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే నేను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండబోతున్నట్లు తెలిపారు’. పార్టీ జెండాను కూడా చేవెళ్లలో ప్రారంభించ బోతు న్నాన’న్నారు. వైఎస్సార్సిపికి తోకపార్టీగా వైఎఎస్పార్టిపి ఉండబోదని షర్మిలా అభిమాని రాఘవరెడ్డి అన్నారు. అవసరమైతే.. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నీళ్లు.. నిధుల కోసం.. ఆంధ్ర సిఎం జగన్తో కూడా తలపడనున్నట్లు తెలిపారు. ‘జగన్కు, షర్మిలకు భేదాభిప్రాయాలు కాదు, భిన్నాభిప్రాయాలున్నాయ’ని వైసిపి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మంగళ వారం విలేకరులతో అన్నారు. ‘జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల సుదీర్ఘ యాత్ర చేశారు. ఇప్పుడు షర్మిల పార్టీ ఏర్పాటుకు, వైసిపికి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ ఏర్పాటుపై రెండు, మూడు నెలలుగా దీనిపై చర్చ సాగుతోంది. దీనిపై తప్పుడు భాష్యాలు వచ్చే అవకాశ ముంది. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos