పొలిటికల్ స్టైలిష్స్టార్….

పొలిటికల్ స్టైలిష్స్టార్….

ఎప్పుడు రాజకీయాలు,సమావేశాలు,యాత్రలతో తీరికలేకుండా గడుపుతూ ప్రతీ
ఒక్కరికి వినయంగా నమస్కరిస్తూ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు వైసీపీ అధినేత జగన్‌.దీంతోపాటు
జగన్‌ పేరు వినగానే క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌,తెలుపు లేదా గళ్లచొక్కాతో కనిపించే జగన్‌
హఠాత్తుగా సినిమా హీరోలా దర్శనమిచ్చి ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసారు.పాదయాత్రలు,బహిరంగ
సభలతో ఏడాదికి పైగా తీరిక లేకుండా జగన్‌ కొద్ది రోజుల క్రితం లండన్‌ దేశంలో చదువుకుంటున్న
తమ కుమార్తెను చూడడానికి కుటుంబంతో సహా వెళ్లిన విషయం తెలిసిందే.ఇక్కడంటే ప్రతిపక్ష
నేత,రాజకీయ నాయకుడు కావడంతో ఫార్మల్‌గా కనిపించే జగన్‌ లండన్‌ వెళ్లగానే అక్కడి వస్త్రధారణలోకి
మారిపోయారు. టీషర్ట్ – టీషర్ట్ పైన  బ్లేజర్.. జీన్స్ ప్యాంట్ విత్ బ్లాక్ షూస్ తో సినిమా హీరోలా మారిపోయారు. జగన్ డ్రెస్ మారింది కానీ.. జగన్‌ మార్కు చిరువనవ్వు మాత్రం మారలేదు.ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో
కనిపించే చిరునవ్వుతోనే కన్పించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న జగన్‌ 27వ తేదీన తాడేపల్లిలో జగన్ కొత్తగా
నిర్మించిన ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos