కాల్పులు జరిపింది యువకుడు కాదు బాలుడు

కాల్పులు జరిపింది  యువకుడు కాదు బాలుడు

న్యూఢిల్లీ : ఇక్కడి జామియా మిలియా విశ్వ విద్యాలయం ఆవరణలోని ఆందోళన కారులపై గురువారం కాల్పులు జరిపిన రాం భక్త్  గోపాల్ మైనరేన పోలీసులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. రాంభక్త్పై హత్యా యత్నం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ‘కాల్పు ల కు దిగిన రాంభక్త్ గోపాల్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాంభక్త్ కుటుంబంతో కలిసి ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలోని జీవార్లో ఉంటున్నాడు. సీఏఏ నిరసనకారులపై దాడి చేసేందుకే అతడు కొన్ని రోజుల కిందట ఒక నాటు తుపాకీ కొన్నాడు. గురువారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరాడు. నేరుగా బస్సెక్కి ఢిల్లీకి చేరుకున్నాడు. జామియా మిలియా విశ్వ విద్యాలయం ఆవరణలోని నూతన పౌరసత్వ చట్టం వ్యతిరేకుల బృందంలో చేరాడు. నిరసనకారులు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తుండగా గుంపులో నుంచి బయటికొచ్చాడు. తనను తాను రాం భక్త్ గోపాల్గా చెప్పుకుని నిరసన కారులపై కాల్పులు జరిపాడు. షాదామ్ ఫారూక్ విద్యార్థి అనే విద్యార్థి చేతికి తూటా తగిలింది’అని పోలీసులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos