మితిమీరిన వైసీసీ నేతల బెదిరింపులు?

మితిమీరిన వైసీసీ నేతల బెదిరింపులు?

ఎన్నికల సమయంలో తమది మాటపై నిలబడే ప్రభుత్వమని దౌర్జన్యాలకు,అవినీతికి తమ పార్టీలో స్థానం లేదంటూ చెప్పుకున్న వైసీపీ నేతలు అధికారం దక్కగానే మాట తప్పుతున్నారు.వైసీపీ అధికారంలోకి వస్తే దౌర్జన్యాలు, బెదిరింపులు పెరుగుతాయంటూ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను నిజం చేసేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నేతలు,కార్యకర్తలు బెదిరింపులకు,దాడులకు పాల్పడుతుండడంతో వైసీపీ అధిష్టానానికి కొత్తచిక్కులు వచ్చి పడుతున్నాయి.ఇప్పుడు వైసీపీ నేతల బెదిరింపులు ఎంతలా మితిమీరాయంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఏకైక అంతర్జాతీయ స్థాయి కంపెనీ కియా మోటార్స్‌ అధికారులను సైతం బెదిరించారు.మా పార్టీ అధికారంలో ఉంది..మేం చెప్పినట్లు చేయాలి..మా వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి..మా లారీలనే అద్దెకు తీసుకోవాలి.. మీరు క్షలు సంపాదిస్తుంటే..మేం చూస్తూ ఊరుకోవాలా..కుదరదు అంటూ ఇద్దరు వైసీపీ నాయకులు కియ కార్ల పరిశ్రమ జీఎం సదాశివంను బెదిరించిన ఘటన వెలుగు చూసింది. చెన్నేకొత్తపల్లి మండల వైసీపీ కన్వీనర్మైలారపు గోవిందరెడ్డి..బసంపల్లి మాజీ సర్పంచు డోలా రామచంద్రరెడ్డి కియా మోటార్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఇంటికి వెళ్లి ఉద్యోగాల విషయమై,లారీల అద్దెకు తీసుకునే విషయమై హుకుం జారీ చేశారు.దీంతో సంస్థ జీఎం జిల్లా ఎస్పీ సత్ఏసుబాబుకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సూచన మేరకు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్రంగంలోకి దిగి ఇద్దరి నాయకుల అరెస్టుకు ఆదేశాలిచ్చారు. రామచంద్రారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌన్సెలింగ్నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమై తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గోవిందరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సీకేపల్లి పోలీసు స్టేషన్లో 506 సెక్షన్కింద బెదిరింపులకు పాల్పడిన కేసు నమోదు చేసారు. కియా జీఎంను ఇద్దరు వైసీపీ నాయకులు బెదిరించారని డీఎస్పీ రమాకాంత్ నిర్ధారించారు. ఎవరైనా సరే బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగితే ఉపేక్షిం చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగర్‌ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను, పెట్టుబడులను ఎలా తీసుకురావాలో,రాష్ట్రాభివృద్ధికి నిధుల సమీకరణ ఏవిధంగా చేపట్టాలనే అంశంపై తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంటే వైసీపీ క్షేత్రస్థాయి శ్రేణులు మాత్రం ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఆరోపించినట్లు బెదిరింపులకు పాల్పడుతూ వైసీపీ పార్టీపై,ముఖ్యమంత్రి జగన్‌పై ఏర్పడ్డ సదాభిప్రాయాన్ని సమూలంగా నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు.ఇప్పటికైనా వైఎస్‌ జగన్‌ మేల్కొని నేతలు,కార్యకర్తలను కట్టడి చేయకపోతే వైసీపీ భారీ ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos