కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి : ఈసీకి వైకాపా వినతి

కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి : ఈసీకి వైకాపా వినతి

ఢిల్లీ : శాసన సభ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీలు, మాజీ ఎంపీలు శనివారం ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులను కలుసుకుని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్‌ను కట్టుదిట్టంగా జరిపించాలని కూడా కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అటంకాలు కల్పించడానికి తెదేపా ప్రయత్నించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రగిరి, ఉరవకొండ, మంగళగిరి, రాప్తాడు, దెందులూరు, ధర్మవరం, తాడిపత్రి, గాజువాక, రాజంపేట, చిలకలూరిపేట, వైజాగ్‌ తూర్పు, గుడివాడ, మైలవరం, గన్నవరం, తుని, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో తెదేపా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాప్తాడు రిటర్నింగ్‌ అధికారిని మార్చాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బుట్టా రేణుక, పండల రవీంద్ర బాబు, అవంతి శ్రీనివాస్‌లు సమర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos