అసభ్య పోస్టింగ్స్‌ నుంచి కాపాడండి

అసభ్య పోస్టింగ్స్‌ నుంచి కాపాడండి

మంగళ గిరి:తన పేరిట ఫేస్ బుక్ నకిలీ ఖాతాలతో అసభ్యకరమైన పోస్టిం గ్స్‌  చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని సోమవారం ఇక్కడ మహిళ రక్షణ విభాగా ఎస్పీ సరితకు ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధ రాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ‘ నా ఫేస్ బుక్ అధికారిక పేజీ సాదినేని యామినీ శర్మ పేరిట ఉంది. యామిని సాదినేని, యామిని సాదినేని యువసేన ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాల్ని సృఫ్టించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, ఇతర నాయకుల్ని నేను నిందించినట్లు పోస్టింగ్స్ పెడుతున్నారు. వీటిని నేనే పోస్టు చేసినట్లు భావించిన వారు నాకు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వీటి వల్ల తనకు, తన కుటుంబానికి, పార్టీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం వాటిల్లుతోంది. నా పేరిట ఉన్న ఫేక్ అకౌంట్స్ ను వెంటనే తొలగించాలి. సైబర్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలి. రాజకీయాల్లో ఉన్న ఉన్న మహిళలకు మరింత భరోసా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. మానసి కంగా తనను దెబ్బతీసి రాజకీయాలకు తతను దూరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos