ఇరకాటంలో యడియూరప్ప

ఇరకాటంలో యడియూరప్ప

బెంగళూరు:ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో సారి ఇరకాటంలో పడ్డారు. దీన్నుంచి బయట పడక పోతే పదవికి గండం తప్పదని నిపుణుల మదింపు. ఇది పూర్తిగా స్వయంకృతాపరాధమే. గతంలోనూ ఇలాగే పదవి చ్యుతులయ్యారు. హుబ్బళ్లిలో ఇటీవల జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో 17 మంది అనర్హ శాసన సభ్యుల పట్ల సానుభూతిని వ్యక్తీకరించారు. వారి వల్లే తమకు రాజ్యాధికారం లభించింనందున వారి పట్ల కృత జ్ఞతతో ఉండటం తమ విధిగా పేర్కొన్నారు. అధికారం కోసం తాను నిర్వహించిన ఆపరేషన్ కమలను భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యవే క్షించారనీ విపులీకరించారు. భార్య, బిడ్డలకు దూరంగా రెండు మూడు మాసాలు గడిపిన అనర్హ శాసన సభ్యులు తమకు మద్ధతిచ్చి ప్రస్తుతం వంచ నకు గురవుతున్నరని ఆవేదన చెందారు. ఈ సంభాషణ వీడియోను యడ్యూరప్ప ప్రత్యర్థి ఒకరు మాధ్యమాలకు విడుదల చేయటంతో రాష్ట్ర రాజకీ యాల్లో సంచలనమైంది. అనర్హ శాసనసభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యం అత్యున్నత న్యాయస్థానం తీర్పు త్వరలో వెలువడనున్న దశలో బహి ర్గ తమైన ఈ వీడియో సమస్యను మరింత జటిలం చేసింది. దీన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అత్యున్నత న్యాయ స్థానం దృష్టికి తీసు కెళ్లాయి. మరో వైపు యడ్యూరప్ప వెంటనే పదవికి రాజీనామా చేయాలని విధానసభలో విపక్ష నేత సిద్ధరామయ్య డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos