వారెవ్వా…ఏమి క్యాచు..

వారెవ్వా…ఏమి క్యాచు..

చాలా ఎత్తు నుంచి పడిన బంతిని లాఘవంగా ఒడిసి పట్టుకోవడం ద్వారా
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలే గిన్నీస్‌ గురువారం
వరల్డ్‌ రికార్డును నెలకొల్పింది. మెల్బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో డ్రోన్ల సాయంతో  80 మీటర్ల ఎత్తు నుంచి  విసిరిన బంతిని కళ్లు చెదిరే రీతిలో పట్టుకుంది.
తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా, మూడో ప్రయత్నంలో సఫలమైంది. దీంతో గిన్నీస్‌ వరల్డ్‌
రికార్డు సాధించినట్లుగా అధికారులు ఆమెకు ధృవ పత్రాన్ని అందించారు. 64 మీటర్ల ఎత్తు
నుంచి విసిరిన బంతిని పట్టుకోవడంలో విఫలమైన హీలే 80 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని
పట్టుకోవడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos