ఆ ప్రశ్నకు రాజమౌళి జవాబు ఇవ్వగలడా ?

  • In Film
  • November 3, 2020
  • 121 Views
ఆ ప్రశ్నకు రాజమౌళి జవాబు ఇవ్వగలడా ?

ఆర్ఆర్ఆర్… సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. చరణ్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు. మంచి స్పందన లభించింది. దీంతో తారక్ అభిమానులు ఎప్పటి నుంచో వీడియో కోసం ఎదురుచూస్తున్నారు.రీసెంట్‌గా తారక్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు. అయితే… ఈ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. కానీ టీజర్ చివరిలో కొమరం భీమ్ పాత్ర పోషించిన తారక్ ముస్లింల వలే టోపీ పెట్టుకోవడం వివాదస్పదం అయ్యింది.అయితే.. ఈ వివాదాన్ని తెలంగాణ బీజేపీ మరింతగా సీరియస్‌గా తీసుకున్నట్టుంది. గత వారం రోజులుగా బీజేపీకి చెందిన నాయకులు ఈ టీజర్ గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యకుడు బండి సంజయ్ ట్వీట్స్ చేసారు. రాజమౌళిని సూటిగా ప్రశ్నించారు. ఇంతకీ ఏమని ప్రశ్నించారంటే…హిందువులైన ఆదివాసుల ఆత్మగౌరవం కొమురం భీంకు రాజమౌళి గారి సినిమాలో టోపీ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆదివాసుల దైవం కొమురం భీంకు టోపీ పెట్టేవారికి నిజాం ఫొటోకు కానీ, ఒవైసీకి గాని బొట్టు పెట్టి కాషాయ కండువా వేసే దమ్ముందా?,” అంటూ బండి సంజయ్ తన ట్వీట్లో క్వశ్చన్ చేశారు.ఐతే ఈ సినిమాకి గాని, ఇందులో నటిస్తున్న ఎన్టీఆర్‌కి, రామ్ చరణ్‌కి తాము వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. ఆ సీన్లపైనే తమ అభ్యంతరం అంటున్నారు. “ఈ సినిమాలో నటించే జూ.ఎన్టీఆర్ గారికి గాని, రామ్ చరణ్ గారికి గాని ఇతర నటీనటులకు మేము వ్యతిరేకం కాదు. వారిని గౌరవిస్తాం. అది మా సంస్కారం. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే మాత్రం దాన్ని సహించం. ఈమధ్య హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. దాన్ని అందరం కలిసి అడ్డుకోవాల్సిందే, అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos