జూ.ఎన్టీఆర్‌కు టీటీడీపీ బాధ్యతలు?

జూ.ఎన్టీఆర్‌కు టీటీడీపీ బాధ్యతలు?

వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో దూసుకెళుతున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశంపై మరోసారి వార్తలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడడంతో ఈ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించడం కేవలం ఒక్క జూనియర్‌ ఎన్టీఆర్‌ వల్ల మాత్రమే సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.అందుకే ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా బాధ్యతను తన తరువాత తన కొడుకు నారా లోకేశ్‌ అప్పగించడానికి నిర్ణయించుకున్న చంద్రబాబు తెలంగాణలో పార్టీ బాధ్యతను జూనియర్‌ ఎన్టీఆర్‌కు అప్పగించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.తాజాగా తెలంగాణ తెదేపాకు చెందిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.గత ఏడాది తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెదేపాకు చెందిన ఇద్దరంటే ఇద్దరు నేతలు మాత్రమే గెలిచారు.ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంటకవీరయ్య,మెచ్చా నాగేశ్వరరావులు మాత్రమే గెలిచారు.అయితే సండ్ర వెంటకటవీరయ్య తెరాసలోకి వెళ్లడానికి సిద్ధమవగా మెచ్చా కూడా తెరాసలో చేరనున్నట్లు వార్తలు వినిపించాయి.ఈ వార్తలను ఖండించిన మెచ్చా తెదేపాను వీడే ప్రసక్తే లేదని మరో రెండేళ్లలో తెలంగాణలో తెదేపాకు పూర్వవైభవం వస్తుందన్నారు.రానున్న రెండేళ్లలో తెలంగాణ తెదేపా బాధ్యతలను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేపట్టనున్నారని తెలిపారు.కొత్త నాయకత్వం వచ్చాక తెలంగాణలో తెదేపా మునుపటికంటే ఎక్కువగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు.సండ్ర పార్టీ మారడంపై స్పందిస్తూ..పార్టీ మారే విషయం సండ్ర వ్యక్తిగత విషయమని దీనిపై తాము వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.పార్టీలోకి రావాలంటూ తెరాస నేతలు తమను కూడా సంప్రదించారని అందుకు తాము అంగీకరించలేదన్నారు. కాగా 2014లో రాష్ట్రవిభజన జరిగిన అనంతరం తెలంగాణ తెదేపా బాధ్యతలను జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ డిమాండ్‌ చేయగా ఎన్నికల సందర్భంగా అటువంటి డిమాండ్లు తెరపైకి తీసుకురావద్దంటూ చంద్రబాబు సూచించడంతో నేతలు మిన్నకుండిపోయారు.

Image result for junior ntr tdp

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos