మహేశ్‌బాబుపై వైఎస్‌ జగన్‌ అభిమానుల ఫైర్‌..

మహేశ్‌బాబుపై వైఎస్‌ జగన్‌ అభిమానుల ఫైర్‌..

వైసీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభిమానుల అతి మితిమీరుతోంది.అధికారంలో ఉన్నామనే భావనో లేక తమను ఇంకెవరు ఏమి చేయలేరనే అహమో తెలియదు కానీ అనవసరమైన విషయాలపై కూడా జగన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విషయంలో కూడా వైఎస్‌ జగన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికలుగలా తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో సీనియర్‌ నటి విజయనిర్మల మృతి చెందడంతో కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు కృష్ణ ఇంటికి వెళ్లారు.ఈ సమయంలో చంద్రబాబు,బాలకృష్ణలను రిసీవ్‌ చేసుకున్న మహేశ్‌బాబు తండ్రి కృష్ణతో పాటు అక్కడే ఉండి పరిస్థితిని వివరించారు. అయితే ఏపీ సీఎం జగన్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి కూడా హాజరు కాలేదు.అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శకు వచ్చినప్పుడు హాజరై అన్నీ తానై వ్యవహరించిన మహేష్ ఫొటోలు బయటకు రాగానే జగన్ ఫ్యాన్స్ హర్టయ్యారు.వైఎస్‌ జగన్ ను మహేష్ అవమానించారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.  ఇప్పుడు ఇదే సీఎం జగన్ ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది.అంతే సామాజిక మాధ్యమాల్లో మహేశ్‌బాబుపై ట్రోల్స్‌ మొదలుపెట్టేశారు.జగన్ వస్తే కనీసం మాట వరుసకైనా రారా అని నిలదీస్తున్నారు.  చంద్రబాబు కంటే వైఎస్ ఫ్యామిలీనే ఘట్టమనేని ఫ్యామిలీకి దగ్గర అంటూ ఉదాహరణలు ఎత్తి చూపుతున్నారు.నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ‘పద్మాలయ స్టూడియో’ భూములను క్రమబద్దీకరించారని.. మహేష్ ‘సైనికుడు’ సినిమా విడుదలైనప్పుడు వరంగల్ లో జరిగిన గొడవలో కూడా మహేష్ ను వైఎస్ క్షమించారని పాత విషయాలు జగన్ అభిమానులు తవ్వుతూ ఎత్తిచూపుతున్నారు.అంతేకాదు  కృష్ణ ఫ్యామిలీ మొత్తం వైఎస్ ఆర్ సీపీ పార్టీతో అనుబంధం ఉన్నవారేనని వైఎస్‌ జగన్ కూడా మహేష్ కు స్నేహితుడేనని ఇంత సాన్నిహిత్యం ఉన్నా కూడా  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వచ్చిన జగన్ ను మహేష్ రిసీవ్ చేసుకోకపోవడం.. పైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చిన సమయంలో ఉండడంతో జగన్ ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది.అయినా అసలు వైఎస్‌ జగన్‌ వచ్చినపుడు మహేశ్‌ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారనే విషయం తెలసుకోవాలని కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా వైఎస్‌ జగన్‌ అభిమానులు ఇలా ట్రోల్స్‌ చేస్తుండడం దేనికి నిదర్శనం?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos