కొడాలిని ఢీకొట్టేదెవరో??

అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పోయించే ప్రతిపక్ష నేతల్లో కొడాలి నాని పేరు తప్పకుండా వినిపిస్తుంది. మాటలతో కానీ,చేతలతో కానీ,ఏదైనా విషయంపై అధికార పార్టీని లాజికల్‌గా నిలదీసే కొడాలి నానిని ఎదుర్కోవడానికి అధికార తెదేపా పార్టీకి పెద్ద సవాలే.ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కృష్ణ జిల్లాలో కూడా రాజకీయ వేడి మొదలైంది.అందులోనూ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది.తెదేపా నుంచి వైసీపీలో చేరిన నాని గత ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరపున బరిలో దిగి విజయం సాధించారు.ఈసారి కూడా గుడివాడ నుంచే బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. గతంలో తమకు కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తెదేపా అధినేత చంద్రబాబు పావులు కదువుతున్నారు.అందులో భాగంగా గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి నానిపై ఓటమిపాలైన రావి వెంకటేశ్వరరావు,ఇదే నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న దేవినేని అవినాష్‌లకు కాకుండా కొత్తవారికి టికెట్‌ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొడాలి నానిపై బలమైన నేతను నిలబెట్టాలనే ఉద్దేశంతో రావి – దేవినేనిలు కాకుండా ఎవరైతే గట్టి పోటీ ఇస్తారోనని ఓ సర్వే నిర్వహించాడట. దీంతో వీరిద్దరికి కాకుండా ఇంకొకరికి టికెట్ ఖాయమవ్వనుందనే వార్త హల్ చల్ చేస్తోంది.ఈ పరిణామాలను కొడాలి నాని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉన్నాడట.. గుడివాడ అభ్యర్థిత్వంపై టీడీపీ సాచివేత ధోరణి అవలంభిస్తుండడంతో కొడాలి చేరికల డ్రామాకు తెరతీశారు.  రావి – దేవినేనిలు టికెట్ ఇవ్వకపోతే వారు వైసీపీలోకి చేరే అవకాశం ఉంటుందని ప్రచారం చేయిస్తున్నాడట.. దీంతో ఇప్పుడు టీడీపీలో కూడా అసమ్మతి రాజుకుంటోంది. టీడీపీ అధినేత నిర్ణయం త్వరగా తేల్చకపోతే గుడివాడలో పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నియోజకవర్గ నేతలు అంటున్నారు. గుడివాడ టీడీపీ ఇన్ చార్జిగా రావి వెంకటేశ్వర్ రావు కొనసాగుతున్నందున ఈసారి టిక్కెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కొడాలిపై ఓడినా ఈసారి మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos