పోలీసుల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి?

పోలీసుల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి?

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.ఆందోళనలో భాగంగా విద్యార్థులు బస్సులు తగులబెట్టారని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఝలిపించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి.ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీలోకి చొరబడ్డ పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ చేయడంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.శౌచాలయాలు,గ్రంథాలయంలోకి చొరబడి మరీ పోలీసులు తమపై లాఠీఛార్జ్‌ చేశారంటూ విద్యార్థినిలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం నిరసనలు హింసాత్మకంగా మారాయి.కాగా ఢిల్లీలో విద్యార్థినిలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేస్తున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అందులో పోలీసు శాఖకు సంబంధం లేని వ్యక్తి పోలీసుల జాకెట్‌ ధరించి విద్యార్థినిలపై దాడి చేస్తుండగా పాత్రికేయులు ఫోటో తీశారు.ఈ ఫోటో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.విద్యార్థులపై బీజేపీ జులూం ప్రదర్శిస్తుందడానికి ఇదే ఉదాహరణని దాడికి పాల్పడుతున్న వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తిని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos