ఇంటి నుంచే వాదించండి

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ రోజు రోజుకీ విస్తరిస్తున్నందున ఇక నుంచి న్యాయవాదులు అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించింది.ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. ‘న్యాయ వాదు లకు కొన్ని లింక్లు ఇస్తాం. వాటిని డౌన్లోడ్ చేసుకొని వీడియో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చ’ని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డే వివరించారు. అంత వరకూ న్యాయవాదుల కచ్చేరీలన్నీ మూసి వేయాలని సిబ్బందిని ఆదేశించింది. న్యాయవాదుల ఎలక్ట్రానిక్ పాస్లనూ రద్దు చేసారు. సోమ వారం సాయంత్రం ఐదు గంటలకు లాయర్ల గదులన్నీ మూసి వేయనున్నారు. మంగళ వారం సాయంత్రాని కల్లా ఏమైనా ముఖ్యమైన పత్రాలు ఉంటే వాటిని న్యాయ వాదులు తీసుకెళ్లాలని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos