సమంత vs పూజా హెగ్డే..

  • In Film
  • May 29, 2020
  • 180 Views
సమంత vs పూజా హెగ్డే..

చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానంగా హీరోయిన్ల మధ్య కూడా ఈగోలు,మనస్పర్ధలు ఉంటాయి.అయితే ఇప్పటి తరం హీరోల్లో దూరం తగ్గుతున్నా హీరోయిన్ల వైఖరీలో మాత్రం మార్పు లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు సమంత,పూజా హెగ్డేల మధ్య చెలరేగిన వివాదమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. పూజా హగ్డే తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో సమంత అందంగా లేదంటూ ఒక పోస్ట్ వచ్చిన విషయం తెలిసిందే. సడన్ గా తన ఎకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని క్లారిటీ ఇచ్చింది గాని వెంటనే సమంత పై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మొత్తానికి ఎకౌంట్ తన చేతుల్లోకి వక్గినట్లు చెప్పిన బేబి వెలువడిన పోస్ట్ లపై సరైన వివరణ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం ఓ వర్గం నెటీజన్స్ పూజా హెగ్డే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమంతపై కావాలనే ఈ విధంగా పోస్ట్ లు పెట్టి హేళన చేసిందని కామెంట్ చేశారు.ర్శకురాలు నందిని రెడ్డి, సింగర్ చిన్మయి కూడా పూజా హెగ్డేపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసినట్లు అర్ధమవుతోంది. ఇక మరోవైపు సమంత కూడా ఇన్ డైరెక్ట్ గానే సెటైర్స్ వేస్తోంది గాని పూజా హెగ్డే పేరు ప్రస్తావించడం లేదు. చూస్తుంటే పూజా హెగ్డే కుంపటిలో కాలు పెట్టినట్లు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సమంత ఫ్యాన్స్ ప్రస్తుతం సారి చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో నిన్నటి వరకు పూజా హగ్డేకు మద్దతు ఎక్కువగా వచ్చింది. ఇక ప్రస్తుతం సమంత ఫ్యాన్స్ డోస్ పెంచుతున్నారు. ఎలాగైనా పూజా జరిగిన విషయంపై క్షమాపణ కోరాల్సిందే అంటున్నారు. సోషల్ మీడియాలో #PoojaMustApologizeSamantha అనే ట్యాగ్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు సమంత ఫాలోవర్స్. ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో తెలియదు గాని పూజా హెగ్డే చిన్న వివరణ ఇస్తే బెటర్ అంటున్నారుపూజా తరఫున వకాల్తా పుచ్చుకున్న అభిమానులు మరేం ఫర్వాలేదు నీకు అండగా మేము ఉన్నాము పూజా అంటూ అమ్మాయికి సందేశాల వరద పంపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఓ సరికొత్త సోషల్ మీడియా క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టేశారు. #వి సపోర్ట్ పూజా హెగ్డే అంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ ఊదరగొట్టేస్తున్నారు.ఈ వివాదంపై స్పందించిన పూజా ఇన్ట్సాగ్రామ్ బృందం తన అకౌంట్ సేఫ్టీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, తన అకౌంట్ తిరిగి తన ఆధీనంలోకి వచ్చిందని స్పష్టం చేసింది.మరోవైపు, పూజా పోస్ట్ పై సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద నడుమ సాగిన చాటింగ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సమంతను టీజ్ చేస్తూ నందనీ రెడ్డి, చిన్మయి సాగించిన చాటింగ్ ను కూడా జనాలు విడిచిపెట్టలేదు.ఇక సమంతను సమర్ధిస్తూ చిన్మయి చేసిన ట్వీట్ పైనా బురద జల్లేందుకు నెటిజన్లు వెనుకాడటంలేదు. సామ్ అద్భుతమైన మనిషి అంటూ చిన్మయి ట్వీట్ చేయగా, దానికి వ్యతిరేకంగా ప్రత్యుత్తరాలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాష్ టాగ్ చీప్ సమంతా మాఫియా అన్న క్యాంపెయిన్ కూడా మొదలైంది.ఇక సమంతను అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డేపై ఆమె ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. పూజా హెగ్డేపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నారు. గతంలో అంద వికారంగా ఉన్న పూజా హెగ్డే ఫోటోలను షేర్ చేస్తూ ఆమె పరువుతీస్తున్నారు. సమంతక పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఈ నేపథ్యంలో దీనిపై అటు సమంత కానీ ఇటు పూజా కానీ స్పందించలేదు.అయితే తాజాగా నిన్ను ద్వేషించే వారి గురించి ఏం చెబుతారని సమంతను ప్రశ్నిస్తే.. ‘వారే నాకు స్ఫూర్తి.. మాములుగా పొగడ్తలతో నేను బద్దకస్తురాలిగా తయారవుతాను.. నన్ను తిట్టే వారి వల్లే నాలోని పనితనాన్ని మెరుగు పరుచుకుంటాన’ని చెప్పుకొచ్చింది.దీంతో సమంత,పూజా మధ్య వివాదం నడుస్తోందనే సంకేతాలు వెలువడినట్లయింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos