ఆ కామెంట్లు చూసి చాలా బాధేసింది..

  • In Film
  • August 21, 2019
  • 161 Views
ఆ కామెంట్లు చూసి చాలా బాధేసింది..

తన శరీరాకృతిపై కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కమెంట్లపై బహుభాష నటి నిత్యా మేనన్‌ స్పందించారు.హిందీలో లో నటించినమిషన్ మంగళ్సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ఎవరైనా లావుగా కనిపించారంటే.. తిని కూర్చోవడం వల్ల, బద్ధకం వల్ల లావవుతారని అనుకుంటే అది వారి అమాయకత్వమని తెలిపారు.అలా తిని కూర్చోవడం వలన లావయ్యేవారు కూడా ఉంటారని కానీ నటుల విషయంలో అది ఎంతమాత్రం నిజం కాదని.. మాకు ఎలాంటి బద్ధకం ఉండదని చెప్పుకొచ్చారు. హార్మోన్ల ప్రభావం వలనో.. ఇతర సమస్యలకారణంగానో శరీర బరువు పెరుగుతుందే తప్ప తిని కూర్చొని పొట్ట పెంచుకోవడం లేదని.. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అవగాహన  కల్పించాల్సిన అవసరం చాలా ఉందని.. తన శరీరాకృతిపై వచ్చే కామెంట్లు చూసినప్పుడు చాలా బాధ అనిపించిందని చెప్పుకొచ్చారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos