పెంపుడు కుక్కపై రిక్షావాలా ప్రేమ..

పెంపుడు కుక్కపై రిక్షావాలా ప్రేమ..

ప్రస్తుతం చలిగాలులు దేశవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్నాయి.ఉత్తరభారతంలో ముఖ్యంగా ఢిల్లీలో చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఉదయం పది గంటలు దాటినా ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.ఉదయం పది దాటినా తగిన రక్షణ లేకుండా మనుషులు బయటకు రాలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో ఓ రిక్షావాలా చలికి వణుకుతున్న తన పెంపుడు కుక్కపై చూపిన ప్రేమ,అక్కర నెటిజన్ల మనసులు దోచుకుంది.నిత్యం తనవెంటే తిరిగే కుక్కకు కూడా చలివేస్తుందని, అది కూడా బాధపడుతుందని తెలుసుకున్నాడు. దానికోస ప్రత్యేకంగా దుప్పటి సేకరించాడు.చలి నుంచి , రక్షణకు తనెన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో, కుక్కకు దుప్పటి చుట్టి అంతే సంరక్షణ కల్పించాడు. దృశ్యాన్ని ఔత్సాహికుడు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రిక్షావాలా మానవత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos