అమిత్‌ షా అధికార దుర్వినియోగం

న్యూఢిల్లీ: దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన తనని ఓ ఉగ్రవాది అనడం చాలా బాధించిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరో మూడు రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న దశలో బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘భాజపా ఎంపీ పర్వేశ్వర్మ నన్ను ఉగ్రవాది అనడం చాలా బాధించింది. నేను నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ఏమీ చేయ లేదు. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేసాను. నాతో పాటు ఐఐటీ చదివిన 80 శాతం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. ఆదాయ పన్ను శాఖ కమిషనర్ ఉద్యోగాన్ని వదులుకున్నాను. అలాంటి నన్ను ఉగ్రవాది అన్నారు. దీన్ని నేను దిల్లీ వాసులకే వదిలేస్తున్నాను. నేను ఉగ్రవాదినయితే ఫిబ్రవరి 8న కమలం గుర్తుకు ఓటేయండి. లేదు దిల్లీ కోసం నేను శ్రమించాను అనుకుంటే చీపురు గుర్తుకు ఓటేయండి’ అని అభ్యర్థించారు. తనని హిందూ వ్యతిరేకంటూ భాజపా చేసిన విమర్శలపైనా స్పందించారు. ‘నేను ఏ విధంగా హిందూ వ్యతిరేకిని? హనుమాన్కు నేను అపర భక్తుడిని. హనుమాన్ చాలీసాను చెప్పగలను కూడా’ అన్నారు. రాజకీయాల కోసం దిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉపయోగిం చుకుంటున్నారని విమర్శిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos