నిబంధనల్ని ఉల్లంఘించిన వాధ్వాన్ కుటుంబ సభ్యుల అరెస్టు

నిబంధనల్ని ఉల్లంఘించిన  వాధ్వాన్ కుటుంబ సభ్యుల అరెస్టు

ముంబై: లాక్ డౌన్ నిబంధనలను పాటించనందుకు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్, ధీరజ్ వాధ్వాన్ కుటుంబ సభ్యులు, సిబ్బంది మొత్తం – 23 మందిని పోలీసులు శుక్రవారం నిర్బంధించారు. నిందితులు ముంబై నుంచి 5 వాహనాల్లో బయలు దేరి సతారా జిల్లా, మహాబలేశ్వర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్ర నివాసాన్ని బుధవారం రాత్రి చేరుకున్నారు. అక్కడి వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి కుటుంబానికి స్నేహితుడైన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తా నుంచి ‘ప్రయాణం అత్యవసరం’ పాస్ లు తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన 23 మందిలో ఇటలీకి చెందిన ఒక అంగ రక్షకుడూ ఉన్నాడు. అందరినీ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. యస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ కేసుల్లో కపిల్, ధీరజ్ వాద్వాన్ లపై సీబీఐ ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. క్వారంటైన్ ముగియగానే వారిని బంధించాలని సీబీఐ భావిస్తోంది. ఇక వాద్వాన్ కుటుంబానికి ప్రయాణ పాస్ లను మంజూరు చేసిన ఐపీఎస్ అధికారి అమితాబ్ గుప్తా వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గంభీరంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos