వివిప్యాట్‌ కాగితాల లెక్కింపును ఎందుకు పెంచరు?

న్యూఢిల్లీ: ఎన్నికల్లో లెక్కించే వీ వీ ప్యాట్ కాగితాల సంఖ్యను ఎందుకు పెంచడంలేదని సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. వచ్చే ఎన్నికల్లో యాభై శాతం మేరకు వీ వీ ప్యాట్ కాగితాలను ) లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విపక్షాలు దాఖలు చేసిన వ్యాజాల్ని అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం వైఖరి పట్ల న్యాయ స్థానం పెదవి విరిచింది. ప్రస్తుతం ఒక విధానసభ నియోజకవర్గానికి ఒక ఈవీఎం ఓట్లను వీవీప్యాట్ కాగితాల వంతున లెక్కించి సరి చూస్తున్నారు. లెక్కించే కాగితాల సంఖ్యను అధికం చేయక పోవటానికి గల కారణాలేమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రత్యేక కారణాల వల్లే లెక్కింపు పెంచడం లేదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సుదీప్ జైన్ బదులిచ్చారు. రు. ‘వీవీప్యాట్ కాగితాల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒక వేళ పెంచకపోతే కాగితాల లెక్కింపులో ఉన్న ఇబ్బందులను వివరించి మార్చి 28 సాయంత్రం 4 గంటలలోగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయండి’ అని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత విధానం సంతృప్తికరమని భావిస్తే అందుకు గల కారణాలై పేర్కొనాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos