రాష్ట్రానికి మొండి చెయ్యి

రాష్ట్రానికి మొండి చెయ్యి

అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ అది కేంద్ర బడ్జెట్ కాదు అసోం, కేరళ, బెంగాల్, తమిళనాడు బడ్జెట్. రైల్వే బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు. ఏపీకి కరోనా వ్యాక్సిన్ తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే తాయిలాలు ప్రకటించారు. ఏపీకి మెట్రో రైలు కోసం ఆరేళ్లగా అభ్యర్థిస్తున్నా పట్టించుకోలేదు. విజయవాడ, విశాఖలో మెట్రోను ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కోరినా బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం దారుణం. కొచ్చి మెట్రో,బెంగళూరు మెట్రో చెన్నై మెట్రో, నాసిక్ మెట్రో, నాగపూర్ మెట్రోలకు ఓకే చెప్పారని’ విమర్శించారు. ‘బడ్జెట్ విశాఖకు మాత్రం పెద్దగా ఉపయోగం లేని కారిడార్ ఇచ్చారు. రూ.4వేల ధాన్యం సేకరణ బకాయిలు ఇవ్వలేదు. కిసాన్ రైళ్ల గురించి విజ్ఞప్తి చేశాం. 26 జిల్లాలకు కేంద్రీయ విశ్వ విద్యాలయాలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. యువతకూ బడ్జెట్లో నిరాశ కలిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి చేసిన విజ్ఞప్తినీ చేసినా పట్టించుకోలేదు. జరిగిన అన్యాయంపై చర్చించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos