కేసీఆర్‌కు గడ్డు కాలం

కేసీఆర్‌కు గడ్డు కాలం

హైదరాబాద్: తెరాసలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే 19 ఏళ్ల కిందట తెదేపా నేత చంద్ర బాబు నాయుడు ఎదుర్కొన్న పరిస్థితి గుర్తుకు వస్తోందని తెలంగాణా కాంగ్రెసు నేత, మాజీ సినీ నటి విజయ శాంతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరించిన ఎదుర్కొన్న అసమ్మతి గుర్తు కొ స్తోందన్నారు. ఎదురే లేదనుకున్న బాబుకు మంత్రి వర్గ విస్తరణ తర్వాత గడ్డు కాలం మొదలైందన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ చేసిన తిరుగుబాటు తెదేపా ఉనికిని ప్రశ్నార్థకం చేయడం ప్రస్థావనార్హమన్నారు. తొలి నుంచి తెరాసాతో ఉన్న తమను విస్మరిం చారని అసమ్మతి, పార్టీ ఫిరాయించినా పట్టించుకోలేదనే అసహనం రెండు వర్గాల్లో నెలకొంది. దీంతో కేసీఆర్ స్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని వ్యాఖ్యానించారు. తన మాటే శాసనం అనుకున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పేరు చెప్తే భయపడే రోజులు, కను సైగ చేస్తే వణికిపోయే స్థితి గతించి ఆయనకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే అసమ్మతి వర్గం పెరుగుతోంది. దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్ కు ఇప్పటికే అర్థమై ఉంటుందని పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్ కు ఇప్పుడు అదే అనుభవం భాజపా రూపంలో ఎదురవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos