గద్దె దిగిన రామయ్య

గద్దె దిగిన రామయ్య

విజయవాడ: ఎట్ట కేలకు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర రహదారి రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీ నామా పత్రాన్ని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి పంపారు. ప్రభుత్వం మారిన అయిదు నెలలు తర్వాత కానీ ఆయన పదవిని త్యజించ లేదు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే. దీని ప్రకారం ఆయన పదవీ కాలం గత ఏప్రిల్ 24న ముగిసింది. పదవి నుం చి వైదొలగక పోవటంతో నియమావళి ప్రకారం నెల రోజుల వ్యవధితో రాజీనామా చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు ఆయనకు సెప్టంబరులో తాఖీదు జారీ చేసారు. వాటిని ఆయన నెల రోజుల తర్వాత పదవికి రాజీనామా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos