భూములు కొన్న బాబు

భూములు కొన్న బాబు

విజయవాడ:‘గతంలో ఉన్న ముఖ్యమంత్రి,ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు’ అని ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడ ది హిందు ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసం గించారు. ‘గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే నం.1 నగరం. అమరావతి రాజ ధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఒక వైపు అమరా వతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేదా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది. అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది. నేనో ముఖ్య మంత్రిని రాబోయే తరాలకు అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పిం చాలి. ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదు. అమరావతిపై రాజకీయాలు చేస్తు న్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం ఉంటాయ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos