సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై స్టేకు సుప్రీం నో

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై స్టేకు సుప్రీం నో

న్యూ ఢిల్లీ : కేంద్రం రూ.20,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా పథకం క్షేత్ర స్ధాయి పనులను అడ్డు కోలేమని అత్యున్నత న్యాయ స్ధానం శుక్రవారం తేల్చిచెప్పింది. నిర్మాణ పనులకు అనుమతుల జారీలో న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వం అంతకు ముందు తెలిపింది. చట్ట బద్ధ అధికారలను నిలువరించగలమా అని న్యాయమూర్తి ఏఎం కన్విల్కార్ ఫిర్యాదుదారు రాజీవ్ సూరిని ప్రశ్నించారు. ఆ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యం పై విచారణ కొనసాగాల్సిన దశలో ప్రభుత్వం దానికి అనుమతులు ఇస్తోందని ఫిర్యాదుదారు న్యాయ వాది శిఖిల్ సూరి పేర్కొన్నారు. దీనిపై వచ్చే నెల మూడు లోగా బదులివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. జులై ఆరు తర్వాత విచారణను చేపడతామని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos