90 వేల భారత విద్యార్థులకు అమెరికన్ వీసాలు

90 వేల భారత విద్యార్థులకు అమెరికన్ వీసాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది 90,000 భారత విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్టు ఇక్కడి అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. ‘‘ఈ వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్ నుంచే ఉంది. తమ ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అందరికీ అంతా మంచే జరగాలి. అర్హులైన దరఖాస్తు దారులు అందరూ తమ కోర్సుల్లో సకాలంలో చేరి ఉంటారు’’ అని అమెరికన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలోని విద్యా సంస్థల్లో సుమారు 2 లక్షలకు పైగా భారత విద్యార్థులు చదువు కుంటున్నారు. అమెరికాలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులు 20 శాతం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos