జగ్గారెడ్డిపై రాములమ్మ ఫైర్‌..

జగ్గారెడ్డిపై రాములమ్మ ఫైర్‌..

అసలే గెలిచిన 19 ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించడంతో విలీనం భయంతో ఊగిసలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ నేతల అంతర్గత విబేధాలు,మనస్పర్ధలు మరింత తలనొప్పిగా పరిణమించాయి.కాంగ్రెస్‌ పార్టీలో సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన సీనియర్‌ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల్లో అసహనం పెల్లుబుకుతోంది.యూపీఏ కూటమిలో మరో రెండు పార్టీలు వస్తాయని ఇప్పటికే తెదేపా నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉండగా వైసీపీ అధినేత జగన్‌,తెరాస అధినేత కేసీఆర్‌ కూడా యూపీఏతో కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాములమ్మ విజయశాంతి ఫైర్‌ అయ్యారు.జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం జగ్గారెడ్డి ఉత్తమం కాదంటూ మండిపడ్డారు.కేంద్రంలో అధికారం సాధించే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోందని ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టు ప్రయత్నం చేస్తోందన్నారు.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ బద్దశత్రువైన కేసీఆర్‌ యూపీఏతో కలసి వచ్చే అవకాశం ఉందంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను కూడా అయోమయానికి,అసహనానికి గురి చేస్తున్నాయన్నారు.స్ధానిక ఎన్నికల్లో చావో రేవో అనేలా కాంగ్రెస్ పోరాడుతోందని విజయశాంతి అన్నారు. యూపీఏలో టీఆర్ఎస్ చేరబోతోందని చెబితే కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కు ఓటేయడం మేలని ప్రజలు భావించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.జగ్గారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందని ప్రజలు అనుమానించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే కేసీఆర్ మాటలను జగ్గారెడ్డి నమ్ముతున్నారేమోనని ఆమె అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos