జగన్ ప్రటకన చూసైనా కేసీఆర్‌కు బుద్ధొస్తుందా?

జగన్ ప్రటకన చూసైనా కేసీఆర్‌కు బుద్ధొస్తుందా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడంలో కాంగ్రెస్‌ మహిళ నేత విజయశాంతి ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏమాత్రం తీసిపోవడంలేదు. ఛాన్స్‌ దొరికిన ప్రతీసారి కేసీఆర్‌పై,కేసీఆర్‌ పాలనపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందన్నారు.బంగారు పాలనతో తెలంగాణను దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ ఆరోపించారు.ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఫిరాయింపులను ప్రోత్సహించారని చివరకు ఫిరాయింపులపై కోర్టు కూడా నోటీసులు జారీ చేసిందని ఇది కేసీఆర్‌ పాలించే తీరంటూ విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్‌ను ఎన్నుకొని ఆయన పదవిలో కూర్చున్న వెంటనే అధికారపక్షం తరఫున కీలకమైన ఒక తీర్మానం చేయడం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రసక్తే లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పారని, అది తెలంగాణలో అధికారపక్షం చేస్తున్న అరాచకాలకు చెంపపెట్టులాంటిదని విజయశాంతి అన్నారు. తనను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాఠాలు నేర్చుకోవాలని డైలాగులు కేసీఆర్ డైలాగులు చెప్పారని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాళ్లకు చక్రాలు కట్టుకుని కేసీఆర్ తిరిగారని, ఏపీలో జరిగే పరిణామాల మీద కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారంటూ తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos