విజయ్‌పై దర్శకుడి షాకింగ్‌ కామెంట్స్‌ ..

  • In Film
  • October 12, 2019
  • 121 Views
విజయ్‌పై దర్శకుడి షాకింగ్‌ కామెంట్స్‌ ..

తమిళ చిత్ర పరిశ్రమలో ఇళయదళపతి విజయ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విజయ్ అంటే పడిచచ్చే అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయ్ సైతం అభిమానుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటాడు.అభిమానులతోనే కాదు సాధారణ ప్రజలు సైతం కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం చేస్తూ సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అటువంటి విజయ్‌పై ఓ దర్శకుడు చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తుంటారని.. తన అభిమానులపై చూపించే ప్రేమంతా నాటకమేనని సామి అనే తమిళ దర్శకుడు కామెంట్స్ చేశాడు.అభిమానులను కలిసిన తరువాత వారికి హ్యాండ్ షేక్ ఇచ్చి డెటాల్ తో తన చేతులు శుభ్రం చేసుకుంటాడని.. అభిమానులపై ప్రేమ ఉన్నట్లు విజయ్ నటిస్తున్నారని అన్నారు. అతడు సినిమాల్లో నటించడం ఆపాలని, ఈవెంట్స్ లో అనవసరమైన విషయాలు మాట్లాడతారని, అలాంటి మాటలు ఆయన తగ్గించుకోవాలని అన్నారు.కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్ పై ఈ రకమైన కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos